జిమ్‌కి వెళ్లకుండా ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా? అయితే, ఈ యాక్టివిటీస్ చేయండి.
ఫిట్‌నెస్
రోజూ బాస్కెట్ బాల్ ఆడేందుకు ప్రయత్నించండి. టెన్నిస్, స్విమ్మింగ్, సహా ఇతర గేమ్స్ ఆడటం దినచర్యలో భాగంగా చేసుకోవాలి. ఆటలు ఆడుతూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
బాస్కెట్‌బాల్
మీరు ఫిట్‌గా ఉండేందుకు రోజూ కాసేపు నడవచ్చు. దీంతో ఊబకాయం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
నడక
యోగా కూడా చేయవచ్చు. ఇది అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని ఫిట్‌గా కూడా ఉంచుతుంది.
యోగా
రోజుకు 20 నిమిషాలు స్కిప్పింగ్ ఆడొచ్చు. ఇది మీ కండరాలను టోన్ చేస్తుంది. అంతే కాకుండా బరువు కూడా అదుపులో ఉంటుంది. రోజుకు 20 నిమిషాలు స్కిప్పింగ్ చేయాలి.
రోపింగ్
డ్యాన్స్ అనేది మీరు ఆస్వాదించడమే కాకుండా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేలా చేసే యాక్టివిటీ. డ్యాన్స్ చేయడం వలన మానసిక ఉల్లాసంతో పాటు, శారీక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
డ్యాన్స్
రోజులో కొంత సేపు మెట్లు ఎక్కి దిగవచ్చు. ఇది మీ కండరాలను బలపరుస్తుంది. మీరు రోజుకు కొన్ని సార్లు మెట్లు పైకి క్రిందికి వెళ్లాలి.
మెట్లు
దోబూచులాట కూడా ఆడొచ్చు. ఇది సరదాగా ఉంటుంది. మిమ్మల్ని చురుకుగా చేస్తుంది. ఆరోగ్య పరంగా మిమ్మల్ని ఫిట్‌గా కూడా చేస్తుంది.