రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలంటే..

మారుతున్న జీవనశైలి కారణంగా భోజనం సమయంలో చాల మార్పులు వచ్చాయి. సరైన సమయంలో కాకుండా ఇప్పుడు అప్పుడు తినేస్తున్నారు.

దీనికి కారణంగా చాలామంది బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రాత్రి ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం.

ఏవైనా కొన్ని రీజన్స్ కారణంగా రాత్రి 9 తినాల్సి వస్తే తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోవాలని డాక్టర్స్ చెబుతున్నారు.

సాయంత్రం 6 - 8 గంటల లోపు నైట్ డిన్నర్ చేస్తే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుత జీవనవిధానం వల్ల ఒక అరగంట అటు ఇటు కావచ్చు.

రాత్రుళ్లు కడుపు నిండగా తింటే సరిగ్గా జీర్ణం అవ్వని కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ అలవాటు వాడుకోండి.

ప్రతి ఒక్కరూ ఏదైనా తిన్న తర్వాత కనీసం 20 - 25 నిమిషాలు వాకింగ్ చేయాలనీ పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

రాత్రి తిన్న 2 - 3 గంటల తర్వాత మాత్రమే నిద్రపోవాలి. దీని కారణంగా ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యి నిద్ర బాగా పడుతుంది.

కానీ చాలామంది రాత్రి తిన్న వెంటనే బెడ్ పై వాలిపోతారు. ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.