టాలీవుడ్ లో సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు.

కోటా శ్రీనివాస రావు 1943 జూలై 10న విజయవాడ సమీపంలోని కంకిపాడులో జన్మించారు.

సినిమాలలో రాకముందు కోటా స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు.

1978లో వచ్చిన 'ప్రాణం ఖరీదు'తోనే తొలిసారి తెరపై కనిపించారు కోట.

అహ నా పెళ్ళంట సినిమాలో పిసినిగొట్టు పాత్ర కోటాకు చాలా పేరు తెచ్చింది.

విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించారు.

గాయం, తీర్పు, గణేశ్, చిన్నా చిత్రాల్లో  బెస్ట్ విలన్ గా నంది అవార్డు గెలుచుకున్నారు.

1999లో బీజేపీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు కోటా.

 2015లో కోటాకు పద్మశ్రీ పురస్కారం లభించింది.

ప్రస్తుతం 80 వ పడిలోకి అడుగుపెట్టిన కోటా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే కోటా శ్రీనివాసరావు.