బుట్ట బొమ్మ పూజా హెగ్డే రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా..

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిన పూజా కొన్ని కారణాల వలన పలు సినిమాలను రిజెక్ట్ చేసింది.

వకీల్ సాబ్ చిత్రంలో నివేతా థామస్ పాత్రలో మొదట పూజానే అనుకున్నారు. కానీ, డేట్స్ ఖాళీ లేకపోవడంతో పూజా నో చెప్పింది.

బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ చిత్రంలో మొదట హీరోయిన్ గా పూజానే సంప్రదించారట. ఆ సమయంలో ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండడం వలన ఆ ప్లేస్ లో నభా నటేష్ ను తీసుకున్నారు .

నితిన్ మ్యాస్ట్రో లో కూడా పూజానే ఫస్ట్ ఛాయిస్. రీమేక్ లో నటించడం ఇష్టం లేక పూజా సున్నితంగా నో చెప్పిందట.

హరిహరవీరమల్లు చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేనే సెలెక్ట్ అయ్యింది. కానీ, ఆ సమయంలో ఆమె పాన్ ఇండియా మూవీ ఒప్పుకోవడంతో డేట్స్ సర్దుబాటు కాక తప్పుకొంది.

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం స్క్రిప్ట్ మొదట పూజా దగ్గరకే వెళ్లింది. అయితే తనకు పౌరాణికాలు అంత సెట్ కావని తెలిపి రిజెక్ట్ చేసిందట.. దీంతో చివరికి సమంత శాకుంతలం గా మారింది.