1963, ఆగస్ట్ 13 న శ్రీదేవి జన్మించింది
శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయంగర్
నాలుగేళ్ల ప్రాయంలో చిన్నారి అయ్యప్పస్వామిగా “తునైవాన్” వెండితెరపై మెరిసింది
బంగారక్క అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైంది
పదహారేళ్ల వయస్సు చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది
బడిపంతులు చిత్రంలో ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించి, వేటగాడు లో ఎన్టీఆర్ సరసన నటించిన హీరోయిన్ శ్రీదేవి
శ్రీదేవి కెరీర్ మొత్తంలో 260 సినిమాల్లో నటించారు
శ్రీదేవితో అత్యధిక సినిమాలు చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు.. దాదాపు 24 సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి
జగదేకవీరుడు అతిలోక సుందరి లో శ్రీదేవిని చూస్తే నిజంగానే అతిలోక సుందరి అని అనిపించకమానదు
1996లో బోనీ కపూర్ తో వివాహం జరిగింది. శ్రీదేవికి ఇద్దరు కూతుళ్లు
2013లో ఆమెకు పద్మశ్రీ అవార్డ్ లభించింది. శ్రీదేవి తన నటనకుగాను 13ఫిలింఫేర్ అవార్డులు పొందారు
ఫిబ్రవరి 24 న దుబాయ్ లోని తన బంధువు వివాహ వేడుకల్లో గుండెపోటుతో మరణించారు