భోగి పండుగ తెలుగురాష్ట్రాలలో జరుపుకునే పండగలలో ఒక ముఖ్యమైన పండుగ
భోగి పండుగ రోజు 5 ఏళ్ల లోపు పిల్లలపై రేగు పండ్లు పోస్తారు వీటినే భోగిపళ్లు అంటారు
భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు
రేగి పళ్లను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని పెద్దల నమ్మకం
భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపొతుందని నమ్ముతారు
తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని పెద్దలు చెప్తుంటారు
సైంటిఫిక్ గా అయితే రేగు పళ్లలో ‘సి’విటమిన్ అధికం, దీని వల్ల రోగనిరోధకశక్తిని పెరుగుతుంది