పసుపు దంతాల కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఓపెన్‌గా నవ్వలేరు.. మాట్లాడాలేరు

వృద్ధాప్యం, పళ్ళు శుభ్రంగా తోముకోకపోవడం, కొన్ని ఆహార పదార్థాలు వంటి ప్రధాన కారణాల వల్ల దంతాలు రంగు మారుతాయి

రంగు మారిన పళ్లను ఇంట్లో దొరికే వాటితోనే శుభ్రం చేసుకుని తెల్లటి దంతాలను మీ సొంతం చేసుకోవచ్చు

గోరువెచ్చని నీరులో కాస్త ఉప్పు కలిపి ఉదయం, సాయంత్రం దంతాలను శుభ్రం చేసుకుంటే లోపల ఉండే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి 

స్ట్రాబెర్రీలను తినడం వల్ల దంతాల పసుపు రంగు ఈజీగా తొలగించడంలో సహయపడుతుంది

బేకింగ్ సోడాను పటిక పొడిని సమాన నిష్పత్తిలో కలిపి ఆ మిశ్రమాన్ని బ్రష్ తో సున్నితంగా తోముకోవాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా పళ్ళు తోముకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది

ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించడం ద్వారా కూడా పసుపు దంతాల సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు

బొప్పాయి తొక్కలతో పళ్లు రుద్దుకుంటే దంతాలపై ఏర్పడే ఎటువంటి మచ్చలైనా సులభంగా పోతాయి

దంతాలు తెల్లబడటానికి తులసి ఆకులు చాలా ఉపయోగపడతాయి. తులసి ఆకుల పొడితో బ్రష్ చేస్తే ఫలితం ఉంటుంది 

దంతాలను శుభ్రం చేయడానికి వేప కర్ర కంటే మెరుగైన ఆప్షన్ ఇంకొకటి లేదు.  రోజూ వేప పుల్లతో పళ్లు తోముకోవడం వల్ల దంతాలు మెరుస్తాయి