గౌతమ్ రాజు తెలుగు చిత్ర పరిశ్రమలోని సీనియర్ మోస్ట్ ఎడిటర్లలో ఒకరు.
గౌతంరాజు 1954లో జన్మించారు.
చట్టానికి కళ్లు లేవు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యారు.
`శ్రీవారికి ప్రేమలేఖ` చిత్రానికి గాను బెస్ట్ ఎడిటర్ గా తొలి నంది అవార్డును అందుకున్నారు.
ఇప్పటి దాకా దాదాపు 800 పై చిలుకు చిత్రాలకు ఆయన ఎడిటర్ గా పనిచేశారు.
పలువురు ప్రముఖులతో కలిసి పని చేసిన సీనియారిటీ ఆయనకు ఉంది.
మొత్తం ఆరు సార్లు బెస్ట్ ఎడిటర్ గా నంది అవార్డును సొంతంచేసుకున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన దశాబ్ధాల పాటు సేవలందించారు.
గౌతం రాజు గత కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు.
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన 06 జూలై వేకువ ఝామున 1.30 గం.లకు మృతి చెందారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.