టాలీవుడ్ లో యంగ్ టాలెంటెడ్ హీరోల్లో సత్యదేవ్ ఒకడు..

సత్యదేవ్ కంచరణ 1989 జూలై 4న వైజాగ్ లో జన్మించాడు.

మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలో ప్రభాస్ ఫ్రెండ్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సత్యదేవ్

ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసి మెప్పించాడు

పూరి జగన్నాథ్ నిర్మాణంలోవచ్చిన జ్యోతిలక్ష్మీ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు

ఒక పక్క హీరోగా చేస్తూనే మరోపక్క సపోర్టింగ్ రోల్స్ లో కూడా కనిపించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు

ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంతో విమర్శల ప్రశంసలను అందుకున్నాడు

గువ్వాగోరింక, తిమ్మరుసు, గాడ్సే లాంటి చిత్రాలు సత్యదేవ్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి

చిన్నతనం నుంచి చిరంజీవి అంటే ఇష్టం ఉన్న సత్యదేవ్ చిరు సినిమాలోనే ఆఫర్ పట్టేశాడు

బాలీవుడ్ లోనూ అడుగుపెట్టి రామ్ సేతు సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు

ప్రస్తుతం సత్యదేవ్ గాడ్ ఫాదర్, గుర్తుందా శీతాకాలం చిత్రాల్లో నటిస్తున్నాడు

ఇలాంటి పుట్టినరోజులు సత్యదేవ్ మరిన్ని చేసుకోవాలని కోరుకుంటూ  My City Hyderabad తరుపున హ్యాపీ బర్త్ డే సత్యదేవ్