డైలాగ్స్ కి కంచుకోట..  సాయి కుమార్ మాట

డైలాగ్ కింగ్ సాయి కుమార్ 1960 జూలై 27న జన్మించారు

సాయి కుమార్  తండ్రి పి.జె.శర్మ పెద్ద డబ్బింగ్ కళాకారుడు మరియు నటుడు కూడా. తల్లి కృష్ణ జ్యోతి కన్నడ హీరోయిన్.

సాయి కుమార్ పబ్లిక్ రిలేషన్స్ లో బ్యాచలర్స్ చేశారు

1975లో సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘సంసారం’ అనే సినిమాకు డబ్బింగ్ చెప్పారు సాయి కుమార్

డబ్బింగ్ ఆర్టిస్టు తో పాటు నటనలోనూ అడుగులు వేసారు 

బాలనటుడిగా కన్నా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు, కన్నడ పరిశ్రమలలో ఎక్కువ సినిమాలు చేశారు

‘వందేమాతరం’ చిత్రంలో మొదటిసారి హీరో రాజశేఖర్ కి సాయి కుమార్ డబ్బింగ్ చెప్పారు

సాయి కుమార్ కి హీరోగా స్టార్డమ్  తీసుకొచ్చిన చిత్రం ‘పోలీస్ స్టోరీ’

1997లో విడుదలైన ‘అగ్ని ఐపీఎస్, పోలీస్ బీట్, సెంట్రల్ జైల్’ చిత్రాలు భారీ విజయాలు అందుకున్నాయి.

2010లో సాయి కుమార్  నటించిన  ‘ప్రస్థానం’ సినిమా  మంచి గుర్తింపును తెచ్చిపెట్టడమే కాకుండా అవార్డును కూడా తెచ్చిపెట్టింది

ప్రస్తుతం తెలుగు, కన్నడ పరిశ్రమలో నటిస్తూనే, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సాయి కుమార్ కొనసాగుతున్నారు

సాయి కుమార్ భార్య పేరు సురేఖ.. వీరికి ఇద్దరు పిల్లలు ఆది, జ్యోతిర్మయి

సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్నాడు

సాయి కుమార్ మరిన్ని మంచి చిత్రాలలో నటించాలని, ఆయన గొంతు ఎక్కువ సినిమాలలో వినిపించాలని కోరుకుంటూ  My City Hyderabad  తరుపున హ్యాపీ బర్త్ డే