ఉప్పొంగేనే గోదావరి..
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది.
ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తుతోంది.
ఉదయం 9 గంటలకు నీటి మట్టం 59.40 అడుగులకు చేరింది.
గోదావరి వంతెన పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది.
జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
ఇప్పటికే భద్రాద్రి వద్ద రెడ్ అలర్ట్ ప్రకటిచారు.
వరద భద్రాచలం, గోదావరి పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిక