టాలీవుడ్ కు గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి 1955 ఆగస్టు 22వ తేదిన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు
చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్
1978లో పునాదిరాళ్లతో చిరు తన సినీ జీవితాన్ని మొదలుపెట్టారు
హీరోగా, విలన్ గా చిరు నటించి మెప్పించారు
‘ఖైదీ’ చిత్రంతో చిరు కెరీర్ మారిపోయింది
‘విజేత, కొండవీటి రాజా, మగధీరుడు, చంటబ్బాయ్, రాక్షసుడు, దొంగమొగుడు’ వంటి వరుస విజయాలతో చిరంజీవి స్టార్ ఇమేజ్‌ని సంపాదించుకున్నారు
‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రంలో చిరు నటనకు ఫిదా కానివారుండరు
తెలుగులో మొట్టమొదటి బ్రేక్ డాన్స్ చేసింది చిరునే
చిరు కెరీర్‌లో ఇంద్ర, ఠాగూర్ వంటి సినిమాలు మాస్ ప్రేక్షకులకు ఇంకా దగ్గర చేశాయి
2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరు.. రాజకీయాల్లోకి ప్రవేశించారు
కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసి కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు
ఇక పూర్తిగా రాజకీయాలను వదిలిసినిమాలకు పరిమితమయ్యారు
1980 లో అల్లు సురేఖ ను చిరు వివాహమాడారు
చిరుకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు
మెగాస్టార్ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా చిరు ఇప్పటికే ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు
నేటితో చిరు 66 వ పడిలో అడుగుపెడుతున్నారు
చిరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని కోరుకొంటూ My City Hyderabad తరుపున హ్యాపీ బర్త్ డే మెగాస్టార్