దానిమ్మతో యవ్వనంగా మెరిసిపోవచ్చు

టేబుల్‌స్పూను దానిమ్మ పొడిలో అరటేబుల్‌ స్పూను నిమ్మరసం, అరటేబుల్‌ స్పూను తేనె వేసి చక్కగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు స్క్రబ్బర్‌లా రుద్ది కడగాలి. దీనివల్ల ట్యాన్‌ తొలగి ముఖ చర్మం మృదువుగా మారుతుంది.

దానిమ్మ పొడిలో కొన్ని నీళ్లు పోసి మెత్తని పేస్టులా చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి.

20నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది.

వయస్సురీత్యా వచ్చే ముడతలను కూడా దానిమ్మ తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఈ పొడిని రాసుకుంటే మార్పు మీకే కనిపిస్తుంది.

దానిమ్మ తొక్కలు చర్మం pHని సమతుల్యం చేస్తుంది. తేమగా ఉంచుతంది.

చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. హానీకరమైన యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది.