వేపతో ఎన్నో ప్రయోజనాలు.. ఆ వ్యాధులకు చెక్..

వేపతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు, దద్దుర్లు వంటి సమస్యల నుంచి వేప ఆకులు ఉపశమనం కలిగిస్తాయి.

12 నుంచి 15 వేప ఆకులను నీటిలో మరిగించి.. అనంతరం వాటిని వేడి నీటిలో కలుపుకుని స్నానం చేస్తే చర్మ ఇన్ఫెక్షన్లు తొలిగిపోతాయి.

వేపలో ఉన్న ఫ్లేవనాయిడ్స్, టెర్పెనాయిడ్స్.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరం. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి.

ఈ వేప ఆకులను డైలీ రొటీన్‌గా తీసుకుంటున్నట్లయితే.. మీ రక్తం శుద్ధి అవ్వడమే కాదు.. మొటిమలు కూడా తగ్గుతాయి.

వేపలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు ఉదర సమస్యలను దరికి చేరకుండా కంట్రోల్ చేస్తుంది. పలు ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

కడుపు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో వేపాకు చాలా ఉపయోగకరం. నులిపురుగుల సమస్య, అసిడిటీ, ఆకలి బాధల నుంచి వేప ఉపశమనాన్ని ఇస్తుంది.

ఏవైనా మొటిమలు లేదా కురుపులు లాంటివి మీ శరీరంపై ఉంటే.. వేప ఆకును అలాగే దాని బెరడును పేస్ట్‌గా రుబ్బి.. దాన్ని ఆ ప్రదేశంలో రాయాలి.

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు వేపలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి కాలానుగుణంగా వచ్చే జబ్బులను నయం చేస్తాయి.