టాలీవుడ్ స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు..

మహేష్ బాబు..1975 ఆగస్ట్ 9న చెన్నైలో హీరో కృష్ణ, ఇందిర దంపతులకు జన్మించారు.

నాలుగేళ్లకే నీడ చిత్రంతో తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు మహేష్‌

తండ్రి అడుగు జాడల్లో బాల నటుడిగా అలరించాడు మహేష్ బాబు

1999 లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన 'రాజకుమారుడు' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబుకి ఈజీగా ఇండస్ట్రీలో ఎంట్రీ దొరికింది. కానీ.. స్టార్ డమ్ మాత్రం మహేష్ తన టాలెంట్ తోనే సాధించాడు

మురారి, ఒక్కడు, పోకిరి, అతడు, బిజినెస్ మ్యాన్, మహర్షి, శ్రీమంతుడు ఇలా టాలీవుడ్ కు బిగ్గెస్ట్ హిట్లను అందించాడు మహేష్

2005 లో మహేష్, హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ ను ప్రేమించి పెళ్లాడారు

మహేష్ కు ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార

మహేష్ రీల్ హీరోనే కాదు రియల్ హీరో కూడా.. ఆంధ్రప్రదేశ్‌లోని రెయిన్‌ బో ఆస్పత్రితో కలిసి ఎంతో మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి మానవత్వం చాటుకుంటున్నారు

ఏపీలో బుర్రిపాలెం, తెలంగాణలో సిద్ధాపురం అనే రెండు గ్రామాలను దత్తత తీసుకొని నిజమైన శ్రీమంతుడు గా ప్రశంసలు అందుకున్నారు 

నేటితో 47 వ పడిలోకి అడుగుపెడుతున్న మహేష్  వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారారు

మహేష్ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ  My City Hyderabad  తరుపున హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్