బ్రేక్‌కి బ్రేక్‌.. రీఎంట్రీ అదుర్స్ 

‘నిరీక్షణ’, ‘లేడీస్‌ టైలర్‌’, ‘భారత్‌ బంద్‌’ వంటి తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ అర్చన .

దాదాపు 28 సంవత్సరాల తర్వాత చోర్ బజార్ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన  అర్చన.

బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై పవన్ కళ్యాణ్ ను వివాహమాడిన హీరోయిన్ రేణు దేశాయ్

పవన్ తో విడాకుల తరువాత ఇంటికే పరిమితమైన రేణు.. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత టైగర్ నాగేశ్వరావు చిత్రంలో నటిస్తోంది

మురారి సినిమాతో తెలుగుతెరకు పరిచయమై.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన హీరోయిన్ సోనాలి బింద్రే

క్యాన్సర్ కారణంగా సినిమాలకు దూరమైన సోనాలి క్యాన్సర్ ను జయించి ప్రస్తుతం పలు హిందీ సినిమాల్లో నటిస్తోంది

‘గోల్కొండ హైస్కూల్‌’, ‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ‘కలర్స్‌’ స్వాతి ప్రేక్షకులకు సుపరిచితురాలే.

పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన తెలుగమ్మాయి.. దాదాపు ఐదేళ్ల తరువాత పంచతంత్రం సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది

'పందెం కోడి', 'గుడుంబా శంకర్', 'గోరింటాకు' వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ మీరా జాస్మిన్.

పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మీరా.. భర్త నుంచి విడిపోయాకా అవకాశాల కోసం  గ్లామర్ డోస్ పెంచి మరీ రీ  ఎంట్రీ  ఇస్తోంది

'ఒక్కడు', 'ఖుషి', 'సింహాద్రి', 'మిస్సమ్మ' చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొంది భూమికా చావ్లా

పెళ్లితో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన భూమిక.. సపోర్టింగ్ రోల్స్ తో రీ ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతోంది

బొమ్మరిల్లు చిత్రంతో ప్రేక్షకులకు హ..హ.. హాసినీ గా గుర్తుండిపోయిన హీరోయిన్ జెనీలియా

పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన జెనీలియా.. దాదాపు పదేళ్ల  తర్వాత జెనీలియా ఒక తెలుగు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది