ప్రతి మనిషి జీవితంలో నిద్ర అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు
ప్రతిరోజూ కనీసం ఏడు గంటలు నిద్రపోకపోతే, మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.
మీ శక్తిని రీఛార్జ్ చేయడానికి మీరు ప్రతిరోజూ కనీసం 7-8 గంటల నిద్రను తీసుకోవడం చాలా ముఖ్యం
7.30 గంటల కంటే తక్కువ నిద్రపోతే మాత్రం వారికి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయని అమెరికాలోని
పెన్సిల్వేనియా సైంటిస్టులు
రీసెంట్ సర్వేలో వెల్లడించారు
తగినంత నిద్ర లేకపోవడం శారీరక ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది
రాత్రి నిద్ర 5 గంటల కంటే తక్కువగా ఉండేవారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం మూడు వంతులు ఎక్కువగా ఉంటాయట
తక్కువగా నిద్రపోతే బరువు పెరగడం, కొలెస్ట్రాల్, గుండెపోటు, బ్లడ్ ప్రెషర్ , కంటి సమస్యలు ఒక్కొక్కటిగా చుట్టుముడతాయి
సరిగ్గా నిద్రపోకపోతే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి బలహీనపడుతుంది. దీంతో డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది
అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్ర పోవాలని, చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలని, టీనేజిలో ఉండే వారు 10 గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు
నిద్ర లేకపోవడం వల్ల రుతుక్రమం సక్రమంగా జరగకపోవడం, అధిక ప్రవాహం వంటి రుతుక్రమ సమస్యలకు దారితీయవచ్చు