సూర్య బర్త్ డే స్పెషల్
సూర్య 23 జూలై 1975 లో జన్మించాడు
సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్
తమిళంలో ప్రాచుర్యం పొందిన నటుడు శివకుమార్ పెద్ద కుమారుడు
దర్శక దిగ్గజం మణిరత్నం సిఫార్సు తో సూర్య అని పేరు మార్చుకున్నాడు
సూర్య 1997లో తొలిసారిగా 'నెరుక్కు నేర్' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు
బాలా దర్శకత్వంలో వచ్చిన 'నంద' సినిమాతో సోలో హీరోగా భారీ విజయాన్ని అందుకున్నాడు
బాలా దర్శకత్వంలోనే తెరకెక్కిన శివ పుత్రుడు చిత్రంలో సపోర్టింగ్ రోల్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు
2005 లో గజిని సినిమా సూర్యను ప్రపంచానికి పరిచయం చేసింది. తెలుగులోనూ అతడికి ఫ్యాన్స్ ను తెచ్చిపెట్టింది
గజిని తరువాత సూర్య ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజ్ కావడం మొదలయ్యింది
నటుడిగా సూర్య చేయని ప్రయోగం లేదు. దాదాపు అన్ని జానర్స్ ని టచ్ చేశాడు. చివరికి విక్రమ్ లో విలన్ గా కూడా నటించి మెప్పించాడు
హీరోయిన్ జ్యోతికను ప్రేమించిన సూర్య.. ఇరు వర్గాల కుటుంబాలను ఒప్పించి 11 సెప్టెంబర్ 2006 న వివాహం చేసుకున్నాడు
వీడోక్కడే, ఘటికుడు, సింగం వంటి సినిమాలతో తెలుగులో కూడా తన మార్కెట్ ని పెంచుకున్నాడు
ఇక గతేడాది రిలీజ్ అయిన 'ఆకాశం నీ హద్దురా' జాతీయ అవార్డును దక్కించుకొంది
సూర్య నటించిన జై భీమ్ ఆస్కార్ కు నామినేట్ అవ్వడం గమనార్హం
‘అగరం ఫౌండేషన్’ ద్వారా పేద విద్యార్ధులను చదిస్తున్నాడు సూర్య
ప్రస్తుతం సూర్య, బాలా దర్శకత్వంలో అచలుడు అనే సినిమా చేస్తున్నాడు
నేడు 47 వ పడిలోకి అడుగుపెడుతున్న మన రోలెక్స్ సర్ కు My City Hyderabad తరపున హ్యాపీ బర్త్ డే..