అలర్జీకి ఔషధం వంటిట్లోనే.. ఇలా చేయండి

కొంతమందిలో ఇమ్యునిటీ తక్కువగా ఉండటం వల్ల అపరిశుభ్రత, కీటకాలు వల్ల తొందరగా అలర్జీలు వస్తుంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒకరి నుంచి మరొకరికి వ్యాంపించేస్తుంది

ముఖ్యంగా వర్షాకాలంలో వ్యాధులు, అలర్జీలు వంటివి ఎక్కువగా వస్తుంటాయి. ఐతే ఇందుకు ఇంటిలోనే తక్కువ ఖర్చుతో వైద్యం చేసుకోవచ్చు.

వంటింట్లో దొరికే పసుపు, అల్లం, పెరట్లో వేప చెట్ల ఆకులు, తులసి ఆకులు, పుదీనా వంటి వాటితో అలర్జీలకు చిటికెలో చెక్ పెట్టేయొచ్చు. అదేలాగో చూద్దాం..

పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయన సంగతి తెలిసిందే. రోగనిరోధక శక్తిని పెంచటంలోనూ పసుపు పాత్ర కీలకమే

రోజూ గ్లాసు వేడి పాలల్లో చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకుని తాగితే అలర్జీలను అరికట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మన పూర్వికుల కాలం నుంచి పాటిస్తున్న పద్దతే ఇది

శరీరంపై దురద అరికట్టడానికి కొబ్బరి నూనెలో వేపనూనె కలిపి శరీరానికి అప్లై చేస్తే వేపలో యాంటీమైక్రోబియల్‌ లక్షణాలు అలర్జీలను పారదోలుతాయి

శరీరంలో రోగనిరోధక శక్తిని పుష్కలంగా అందించే యాంటీహిస్టమిన్‌ లక్షణాలు అల్లంలో సమృద్ధిగా ఉంటాయి. అల్లం శరీరంలోపలి నుంచి అలర్జీకి ఉపశమనం కలిగిస్తుంది

దగ్గు, జలుబు, శ్వాస నాళాల్లో ఏదైనా సమస్య ఉంటే తులసి తక్షణ ఉపశమనం అందిస్తుంది. కొన్ని పుదీనా ఆకులు నీళ్లలో మరిగించి వేడిగా తాగితే అలర్జీలు పరార్‌

 మింట్‌ ఆయిల్‌ను శరీరంపై పూతలా రాసినా మంచి గుణం కనిపిస్తుంది. అలర్జీ లక్షణాలు కనిపించినప్పుడు కొన్ని తులసి ఆకులను నమిలితే బాగా పనిచేస్తుంది