వానాకాలంలో కండ్లకలక  కేసులు పెరగడం సహజమే,ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.

కంటి కలకను ఐ ఫ్లూ , మద్రాస్ ఐ, పింక్ ఐ  అని కూడా పిలుస్తారు.

కంటికి హానికరమైన సూక్ష్మజీవులు ,ఫంగస్,అలెర్జీలు గాలి నుంచే కళ్లకు  సోకుతాయి.

కళ్లను చేతులతో తాకొద్దు..మీ వస్తువులను ఇతరులతో పంచుకోవద్దు

కండ్ల కలక ఒకరి నుంచి ఒకరికి త్వరగా సోకుతుంది, కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

చేతి రుమాళ్లను ఒకరివి మరొకరు వాడకండి.

ఎవరి కళ్లు అయినా ఎర్రగా కనిపిస్తే వారికి దూరంగా ఉండండి.