కొబ్బరినూనె ఇలా వాడారంటే మీ అందం రెట్టింపు

సహజ చర్మ సంరక్షణగా కొబ్బరినూనె ప్రభావవంతంగా పనిచేస్తుందని సౌందర్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కొబ్బరి నూనెలోని పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని పాడుతుందని అంటున్నారు

కొబ్బరినూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్ గుణాల కారణంగా దీనిని సరిగ్గా వినియోగిస్తే వృద్ధాప్య ఛాయలను నివారించవచ్చు

మొక్కల ఆధారిత కొవ్వులు రెండు రకాలు ఉంటాయి. శుద్ధి చేసినవి, శుద్ధి చేయనివి. వీటిల్లో శుద్ధి చేయని కొబ్బరి నూనెను వర్జిన్ కొబ్బరి నూనె అంటార

 కొబ్బరిలోని తెల్లని భాగం నుంచి తీసిన ఈ నూనును ఎటువంటి అదనపు ప్రాసెసింగ్ లేకుండా తయారు చేస్తారు. అదే శుద్ధి చేసిన కొబ్బరి నూనెను బ్లీచ్ చేయడానికి మరింత ప్రాసెస్ చేస్తారు

చాలా మంది చర్మవ్యాధి నిపుణులు చర్మ సంరక్షణ కోసం శుద్ధి చేయని కొబ్బరి నూనెను సిఫార్సు చేస్తారు. ఇది సహజ మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది

దీనిని చర్మంపై ఉపయోగించడం వల్ల నల్ల మచ్చలు, వృద్ధాప్య సంకేతాలు తగ్గించడమేకాకుండా గాయాలకు చికిత్స చేస్తుంది 

శరీరంలో కొల్లాజెన్, యాంటీఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుంది. కొబ్బరి నూనె చర్మాన్ని అలెర్జీ కారకాలు, కాలుష్య కారకాల నుంచి రక్షణ కల్పిస్తుంది

తామర వంటి చర్మ సమస్యలను కొబ్బరి నూనెతో నియంత్రించవచ్చు. అలాగే నూనె ఎండ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఇది హానికారక UV కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది

అలెర్జీ ఉన్న ఎవరైనా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. ఐతే ముఖంపై మొటిమలు ఉన్న ప్రదేశంలో మాత్రం దీనిని ఉపయోగించకుండు. రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది