అన్నం మిగిలిపోతే పడేయకుండా ఇడ్లీలు చేసేయండి.

ఇడ్లీ రవ్వను  ఒక అరగంట నానబెట్టుకోవాలి. 

మిగిలిన అన్నాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.

 ఆ మిశ్రమాన్ని ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వలో కలిపేయాలి.

ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు కాస్త నూనె రాసి ఇడ్లీ పిండిని వేసుకోవాలి.

ఆవిరి మీద ఉడికిస్తే వేడి వేడి అన్నం ఇడ్లీలు రెడీ అయిపోతాయి.

ఇడ్లీలను టమాటా కొబ్బరి చట్నీలతో తింటే రుచి అదిరిపోతుంది.