జుట్టు రాలడం ఈ మధ్య చాలామందిని బాధ పెడుతున్న సమస్య
అపురూపంగా చూసుకునే కురులు అకారణంగా రాలిపోతుంటే ఆ బాధ వర్ణణాతీతం
పొల్యూషన్, ఆహార అలవాట్లు, జీవనశైలి, ఒత్తిడి వంటి కారణాలు కూడా ముఖ్యమైనవని అంటున్నారు నిపుణులు
స్త్రీలలోనైతే ఐరన్ లోపం, ఋతుక్రమం సక్రమంగా రాకపోవడం, రక్తహీనత, హర్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి కారణాల వల్ల జుట్టురాలిపోతుంటుంది
వంశపార్యం పర్యంగా వచ్చే జన్యుపరమైన లోపాలు వల్ల కూడా జుట్టు రాలడం, బట్టతల రావడం వంటి సమస్యలు వస్తాయి
లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మంచి డైట్ ఫాలో కావాలి. రోజూ వ్యాయామం చేయాలి. పొగతాగడం మానేయాలి
జుట్టును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.హెయిర్ కండీషర్లను వాడేవారు మీ జుట్టు సరిపోయేవి మాత్రమే వాడుకోవాలి
జుట్టుకు వారంలో రెండు సార్లు కొబ్బరి నూనెతో కానీ బాదాం నూనెతో మర్దనా చేస్తే జుట్టు పెరుగుతుంది
షాంపూలు, కండీషనర్లు .. ఏవి పడితే అవి వాడడం మంచిది కాదు