అందమైన కళ్లు ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు కళ్ల అందాన్ని తగ్గిస్తాయి

ప్రస్తుతం మన జీవనశైలి చాలా మార్పులకు గురైంది, పని ఒత్తిడిలో తక్కువగా నిద్రపోవడం, ఎక్కువ ఒత్తిడి, తక్కువ నీరు త్రాగడం, జన్యుపరమైన సమస్యలు లేదా హార్మోన్లలో మార్పుల కారణంగా ఈ సమస్య వస్తుంది.

సౌందర్య ఉత్పత్తులను వాడటం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. కానీ వాటిలోని రసాయనాలు హానికరం. ఈ వలయాలను తగ్గించడానికి సహజ మార్గాలు అనేకం అందుబాటులో ఉన్నాయి.

రసాయానాలతో కూడిన సౌందర్య ఉత్పత్తులతో పని లేకుండానే.. ఇంట్లో సహజ పద్ధతిలో ఈ నల్లటి వలయాలను మాయం చేసుకోవచ్చు

కళ్ల కింద నల్లటి వలయాలు పెరిగితే ఐస్ తో మసాజ్ చేయాలి..ఒక టవల్‌లో ఐస్ ముక్కను తీసుకొని డార్క్ సర్కిల్‌పై మసాజ్ చేయండి

కీరదోస కంటికి ఎంతో మేలు చేస్తుంది. వాటిని గుండ్రంగా ముక్కలు చేసి కళ్లపై ఉంచుకోవడం వల్ల నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి

ఆల్మాండ్ ఆయిల్‌ను కళ్ల కింద నల్లటి వలయాలపై రాసి మెల్లగా మసాజ్ చేసి రాత్రంతా ఉంచి .. ఉదయాన్ని చల్లని నీటితో కడగాలి . 

టీ బ్యాగ్‌లు కళ్లను చల్లబరుస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తుంది.  ఫ్రిజ్ లో ఉంచి తీసాక వాటిని కళ్లమీద పెట్టుకొని కొద్దిసేవు ఉంచి తీసేయాలి.

మజ్జిగ, పసుపు కలిపిన పాసే ను డార్క్ సర్కిల్స్ దగ్గర ఉంచి .. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కళ్లను కడిగితే ప్రభావం ఉంటుంది 

బంగాళ దుంపలతో సైతం నల్లటి వలయాలను మాయం చేయొచ్చు. బంగాళాదుంపల సన్నని ముక్కలను కట్ చేసి, వాటిని కళ్లపై 20 నుండి 25 నిమిషాలు ఉంచండి. తర్వాత ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోండి.