పాదాల అడుగున వెనుక భాగంలో చర్మం గరుకుగా మారి తర్వాత పగుళ్లుగా ఏర్పడుతుంది.
శరీరంలోని రక్తం సరిగ్గా అందక శరీరం ఎండిపోయి ఈ పగుళ్లు వ్యాప్తిస్తాయి
ఈ పగుళ్లు తొలగించాలని రకరకలా క్రీములు, మందులు వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి లాభాలు కనిపించవు. అందుకు ఇంట్లోని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి
వెజిటబుల్ ఆయిల్స్‌ను పాదాల పగుళ్లకు చికిత్స కోసం వాడొచ్చు. రాత్రిపూట స్నానం చేసాక పాదాలకు ఆయిల్ మర్దనా చేస్తే ఫలితం ఉంటుంది
వేపాకులతోనూ తేలిగ్గా పాదాల పగుళ్లను దూరం చేయొచ్చు.. వేపాకును పేస్ట్ లా చేసి పాదాలకు పట్టిస్తే ఉపశమనం ఉంటుంది
ఉదయం పూట గడ్డిలో చెప్పులు లేకుండా నడిస్తే మంచిది
బస్త్రిక లాంటి కొన్ని యోగాసనాలు వేయాలి. ఇలా చేస్తే.. పాదాలకు రక్తప్రసరణ సరిగా జరుగుతుంది
రోజులో పావుగంటసేపు పాదాలను చల్లని నీరు నింపిన బకెట్లో ముంచి ఉంచాలి. తరువాత పగుళ్ల భాగంలో బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల మృత కణాలు పోతాయి