గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,  అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు

మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇవాళ, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణలో ఇరవైకిపైగా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తోంది.

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది.

చార్మినార్,   యాకుత్‌పురా, జీడిమెట్ల, యుసూఫ్‌గూడ అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.

కుండపోత వర్షం తో  రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా? అనేలా వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు.