మనలో చాలా మంది జుట్టు ఊడిపోయే సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో బట్టతల సాధారణంగానే వస్తుంది.

ప్రస్తుత కాలంలో యువతే ఎక్కువ బట్టతల సమస్యతో పోరాడుతున్నారు 

ఒత్తుగా ఉండే జుట్టు నుంచి వెంట్రుకలు రాలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే అందులో రోజు తలస్నానం చేయడం వలన బట్టతల వస్తుందని అపోహ ఉంది 

రోజు తలస్నానంచేస్తే  బట్టతల వస్తుందా అంటే.. రాదు అని అంటున్నారు వైద్యులు 

 రోజూ తలస్నానం చేయడంవల్ల జుట్టుకు హాని జరగదన్నారు. జుట్టు కూడా రాలదని.. బట్టతల వచ్చే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు

తలస్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. గాఢత కలిగిన షాంపూలు కాకుండా సున్నితమైన షాంపూలను వాడుకోవడం మంచిది.

రోజు తలస్నానం చేశాక హెయిర్ కండీషనర్ ఉపయోగించాలి. జుట్టు రాలే సమస్య లేకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.