శరీరానికి ఎంతో మేలు చేసే పండుగా నారింజను చెప్పవచ్చు

ఆరెంజ్ తింటే కేవలం విటమిన్ ‘సి’తో పాటు ఎన్నో పోషకాలు లభిస్తాయి. నారింజలో యాంటీ ఆక్సిడెంట్ బెటా కెరోటిన్ ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో తోడ్పడుతుంది

ఇక చాలా మంది నారింజను తినే సందర్భంలో పైనున్న తొక్కను తొలగించి పారేస్తుంటారు. అయితే నారింజ తొక్కతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

నారింజ తొక్క చర్మం నుండి అదనపు నూనెను తొలగించడానికి సహాయపడుతుంది

నారింజ పండు తొక్కలో క్యాన్సర్ కణాలతో పోరాడే గుణం, శక్తి ఉంటుంది.

గుండె జబ్బులు, డయాబెటిస్, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక మంట కలిగిన వ్యాధులకు తగ్గించటంలో నారింజ తొక్క ఉపకరిస్తుంది.

ఈ తొక్కలను చర్మంపై రాస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ఇంకా చర్మాన్ని మృదువుగా చేసేందుకు నారింజ తొక్క అద్భుతంగా పనిచేస్తుంది

 నారింజ తొక్కను మీ దంతాలపై రోజుకు రెండుసార్లు రుద్దితే మీ దంతాలు సహజంగా తెల్లబడతాయి

నారింజ తొక్కల పొడిని సున్నిపిండిలో కలుపుకుని స్నానానికి ముందు చర్మానికి రాసుకుంటే చర్మంపై ఉండే మృతకణాలన్నీ తొలగిపోయి చర్మం మృదువుగా కనిపిస్తుంది.

గాయాలు, ఇన్‌ఫెక్షన్‌కు గురైన చోట నారింజ తొక్కలతో రాస్తే ఇట్టే మాయమైపోతాయి

రక్తంలోని చక్కెర స్ధాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ చికిత్సలో సైతం నారింజ తొక్క సారం సహాయపడుతుంది.