కౌగిలింత.. ఇద్ద‌రి మ‌ధ్య అప్యాయ‌త‌, అనుర‌గానికి నిర్వ‌చ‌నం

సంతోషం వచ్చినా లేదా బాధ కలిగినా ప్రియమైన వారిని గట్టిగా హత్తుకొని మనసులో మాటలను చెప్తూ ఉంటారు 

కౌగిలింత.. హృదయానికి, మనస్సుకు ప్రశాంతతని కలిగిస్తుంది

ఆప్యాయంగా ఒక్కసారి కౌగిలించుకుంటే చాలు మనసులో దాగున్న బాధ అంతా ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోతుంది

తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి, ప్రేమికుడు లేదా స్నేహితుడిని కౌగిలించుకున్నప్పుడల్లా ప్రేమ భావన చాలా రెట్లు పెరుగుతుంది

ఆప్యాయంగా కౌగిలించుకునేవారు లేదా స్పర్శించేవారు లేకపోతే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి తీవ్ర మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది

కౌగిలించుకున్న‌ప్పుడు మ‌న‌లో ఆక్సిటోసిన్‌, డోప‌మైన్‌, సెరొటోనిన్ అనే ర‌సాయ‌నాలు విడుల‌వుతాయి. ఇవి మెద‌డును శాంత ప‌రుస్తాయి

ఒక్క కౌగిలింత ఒక వ్యక్తి మూడ్‌ను ఎంతో హ్యాపీగా మారుస్తుందని ఎన్నో అధ్యయనాలు కూడా తేల్చాయి

నిత్యం జీవిత భాగ‌స్వాములు కౌగిలించుకోవ‌డం వ‌ల్ల వారు కొంత కాలం ఎక్కువ‌గా బ‌తుకుతార‌ని అంచనా 

దీర్ఘ కౌగిలిలో.. మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా.. ఇతర శరీర అవయవాలకు పాజిటివ్‌ వైబ్రేషన్స్‌  పంపిస్తుందని తేలింది 

దేన్నైనా సాధించగలననే కొండంత విశ్వాసం కోసం రోజుకు 12 కౌగిలింతలు అవసరమని మానసిక నిపుణులు తెలియజేస్తున్నారు.