భారతదేశంలో అన్ని వయసుల వారు మధుమేహంతో బాధపడుతున్నారు
సరైన ఆహార నియమాలు పాటించడం వల్ల మధుమేహాన్ని చాలా వరకు అరికట్టవచ్చు
మధుమేహంతో బాధపడేవాళ్లు.. నిత్యం తాజా కూరగాయలు తీసుకోవాలి
రోజూ తీసుకునే ఆహారంలో గ్రీన్ లీఫీ కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. కేల్, పాలకూర, బచ్చలికూర, క్యాబేజీ, బ్రొకోలీ తినాలి
ముడి బియ్యం, పొట్టు తియ్యని ధాన్యాలు వంటివి తీసుకోవటం వల్ల పీచుపదార్థం అధికంగా లభ్యమై మధుమేహాన్ని నియంత్రించుకోవటంలో తోడ్పతుంది.
వాల్ నట్స్, బాదాం, వేరుశనగ వంటి నట్స్ ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి
పసుపు, అల్లం, దాల్చిన చెక్క ఆహారంలో తీసుకోవాలి
రోజూ తాజా పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాలి