నల్లద్రాక్షతో ఫేషియల్.. మరింత యంగ్ లుక్‌లోకి
నల్ల ద్రాక్ష పండ్లను పేస్టులా చేసుకోవాలి.
ఇందులో ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ బాగా కలిపి పేస్టులా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వాలి.
తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
కొన్ని నల్ల ద్రాక్షపళ్లను బాగా స్మాష్ చేసిగుజ్జు తీయాలి.
దీనిలోకి చెంచా పంచదార, చిటికెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి సున్నితంగా మర్దన చేయాలి.
20 నిమిషాల తర్వాత ప్యాక్ కడిగేయాలి.
ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇ
లా చేస్తే ముఖం యంగ్‌లుక్‌తో కనిపిస్తుంది.
టొమాటో స్మాష్ చేసి అందులో ద్రాక్ష పండ్లను జోడించి మెత్తని పేస్టులా చేసుకోవాలి
దీన్ని ముఖం, మెడకు అప్లై చేస్తే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.