మహిళలను ఇబ్బంది పెట్టే ప్రధాన సమస్య నెలసరి. చాలా మంది స్త్రీలు రుతుస్రావం సమయంలో కడుపు నొప్పి, నడుం నొప్పితో బాధపడుతుంటారు

నెలసరి సమయంలో సాధారణంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా కడుపు నొప్పి అధికంగా ఉంటుంది

నెలసరి సమయంలోకడుపునొప్పి , చిరాకు, తలనొప్పి, నడుము నొప్పి, ఎంతో బాధపెడతాయి 

పీరియడ్స్ మొదలైన తొలి 24 గంటల్లో నొప్పి ఎక్కువగా ఉండి ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది

పీరియడ్స్ టైమ్‌లో వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మందులు వాడడం అంత మంచిది కాదు. ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాల ద్వారా నొప్పికి ఉపశమనం అందించండి 

పీరియడ్స్ రావడానికి ముందు బొప్పాయి పండు తినడం ఉపకరిస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ప్లేమటరీ ఉండడం వలన పొత్తి  కడుపు కండరాలను పట్టి ఉంచుతాయి 

తులసి టీ .. పీరియడ్స్ టైమ్ లో ఎంతో మేలు చేస్తుంది. ఈ టీ తాగడం వలన పీరియడ్స్ టైమ్‌లో వచ్చే కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు ఇతర సమస్యలు తగ్గుతాయి

హాట్ ప్యాడ్..  పొత్తికడుపు నొప్పి ఉన్నప్పుడు  పొత్తి కడుపుపై హాట్ ప్యాడ్ ఉంచడం వల్ల నొప్పి కాస్త తగ్గుతుంది. గర్భాశయ కండరాలు కొద్దిగా తేలికగా మారి నొప్పి తగ్గుముఖం పడుతుంది

పీరియడ్స్ సమయంలో చాక్లెట్స్ తినడం వలన రిలాక్స్ అవుతారు 

ఆయిలీ ఫుడ్, బేకరీ ఫుడ్, ఇన్‌స్టంట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌ ఐటెమ్స్‌కి దూరంగా ఉండాలి 

యోగా లేదా వ్యాయామం.. పీరియడ్స్ సమయంలో కండరాల బలోపేతం చేసే మితమైన వ్యాయామాలు చేయాలి