ఎండాకాలం మొదలు అయిందో లేదో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి.. ముఖ్యంగా ముఖం పొడిబారుతూ ఉంటుంది 

ఎండాకాలంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా చర్మం పెళుసు బారిపోవడం, నల్లగా మారడంతో పాటు కాంతివిహీనంగా కూడా తయారవుతుంది.

సూర్యుని నుంచి వెలువడే హానికరమైన అతినీల లోహిత (యూవీ) కిరణాలు ముఖాన్ని పొడిబారేలా చేస్తాయి 

ఎండాకాలంలో ముఖం తాజాగా నిగనిగనిగలాడాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి 

రోజూ రెండుసార్లు మంచి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి . చెమట ఎక్కువ ఉంటే రెండు పూట్ల స్నానం చేయాలి 

వేసవిలో చర్మం పొడిబారినట్లయితే రోజూ చర్మంపై కలబందను అప్లై చేయాలి. ఇది చర్మాన్ని లోపలి నుంచి తేమగా ఉంచడంతో పాటు బ్యా్క్టీరియాను కూడా నిర్మూలిస్తుంది

రాత్రి నిద్రబోయేముందు ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకొని పాడుకోవాలి .. ఉదయాన్నే  బయటికి వెళ్లే ముందు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి 

చర్మ సంరక్షణ విషయంలో ఆలివ్ ఆయిల్‌ సమర్థంగా పనిచేస్తుంది. ముఖ్యంగా పొడి చర్మాన్ని నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది

విటమిన్ ఇ టాబ్లెట్స్ ను వాడడం వలన ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని లోపలి నుండి తేమగా ఉంచుతాయి