మన కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?
ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్ 20న జన్మించారు
రమాదేవి విమెన్స్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారు
ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్ చరణ్ ముర్ము. మర్ము దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు
మొదట ఒడిశాలోని ఇరిగేషన్ అండ్ పవర్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు
టీచర్ గా కూడా పనిచేసిన ఆమె తరువాత రాజకీయాలపై ఆసక్తితో బీజేపీ లో చేరారు
1997లో కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముర్ము అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు
2015లో జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా ఎంపికయ్యి ఆమె రికార్డు సృష్టించారు
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా 64 ఏళ్ల గిరిజన మహిళ ఎంపిక అవ్వటంతో ప్రపంచం మొత్తం ఆమెవైపు చూసింది
జూన్ 21 న ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా గెలిచారు
రామ్‌నాథ్ కోవింద్ తరువాత 15 వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవి చేపట్టారు
నేడు దేశ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు
ఓ సాధారణ ఆదివాసీని దేశ అత్యున్నత స్థానంలో నిలబెట్టారు. మీ విశ్వాసం నిలబెట్టేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు
15 వ రాష్ట్రపతిగా పదవి చేపట్టిన ద్రౌపది ముర్ముకు My City Hyderabad తరుపున హృదయపూర్వక శుభాకాంక్షలు