బెల్లం టీ తాగట్లేదా..? దానితో ఎన్ని ప్రయోజనాలో..

బరువు తగ్గేవారికి బెల్లం టీ మేలు చేస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని క్యాలేరీలు కరిగేలా చేస్తాయి.

బెల్లంలోని విటమిన్లు, మినరల్స్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి, ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తాయి.

ఫలితంగా మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్య వంటివి మీ దరి చేరదు. ఇంకా శరీరానికి త్వరగా శక్తి లభిస్తుంది.

బెల్లంటీ తాగడం వల్ల శరీరానికి ఐరన్ లభిస్తుంది. ఫలితంగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారు దాని నుంచి ఉపశమనం పొందుతారు.

ఇంకా దీనిలోని పొటాషియం శరీరంలో ఎలెక్ర్టోలైట్‌లను నియంత్రించి.. హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అలాగే బెల్లంలోని కాల్షియం ఎముకలను పటిష్టంగా చేయడంలో సహాయపడుతుంది. బోలు ఎముకల సమస్యను నివారిస్తుంది.