Tilted Brush Stroke

నిత్యం ఆరోగ్యంగా ఉండాలనుందా.?

ఈ మధ్య కాలంలో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోతోంది. రోజులో కనీసం 30 నిమిషాలైనా ఏదో ఒక శారీకర శ్రమ చేయాలని నిపుణుల సూచన.

నీరు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ రోజూ కచ్చితంగా రెండు నుంచి మూడు లీటర్లకు తగ్గకుండా నీటిని తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.

మనిషి ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ టెక్‌ యుగంలో మనిషికి నిద్ర కరువవుతోంది. 8 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇక మనిషి ఆరోగ్యంగా ఉండడంలో శృంగారానిది కూడా కీలక పాత్ర అని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

జీవితంలో ఒత్తిడులు, పనులు సర్వ సాధారణం అయితే ఎన్ని టెన్షన్స్‌ ఉన్నా నవ్వుతూ ఉండడం మర్చిపోవద్దని నిపుణులు చెబుతున్నారు. నవ్వు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

లైఫ్‌ ఎప్పుడూ ఒకేలా ఉంటే బోర్‌ కొడుతుంది. అందుకే అప్పుడప్పుడు కొత్త ప్రదేశాలను సందర్శిస్తుండాలి. కొత్త వ్యక్తులను కలుస్తుండాలి. ఇలా చేయడం వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది.

జీవితం ఆరోగ్యంగా గడపాలంటే ధ్యానం, యోగలాంటివి భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మెడిటేషన్‌ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఎప్పుడూ ఒంటరిగా ఉండడం, మీ ఆలోచనలను ఎవరితో పంచుకోకపోవడం వల్ల కూడా మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నలుగురితో కలిసి పోతూ నవ్వుతూ బతికేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు.