వారానికి రెండుసార్లు చేపలు ఎందుకు తినాలో తెలుసా.. 

చేపల్లో మాంసకృతులతో పాటు శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. కాల్షియం, పాస్పరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి.

చేపలు గుండెకు సంబంధిత వ్యాధులకు, ఆస్తమా, షుగగర్‌ వ్యాధి గ్రస్తులకు మంచి ఆహారంగా పని చేస్తుంది. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి చేపలు మంచి ఆహారమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు

చేపల కొవ్వు చాలా సులభంగా జీర్ణమై శక్తిని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా తినవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా వారానికి కనీసం రెండుసార్లు చేపలు తినాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది

చేపల్లో ఉన్న కొవ్వు మన శరీరంలో రక్త పీడనంపై మంచి ప్రభావం చూపుతుంది.  ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్‌ఏ, ఈపీఏ వంటివి కంటి చూపునకు ఎంతో మేలు చేస్తాయి

చేపలు మెదడులో రక్తప్రసరణను మెరుగుపరచి.. ఒమేగా 3  జ్ఞాపకశక్తిని పెంచుతాయి. దీంతో వృద్ధాప్యంలో అల్జీమర్‌ వంటి వ్యాధులు దరికి చేరవు

చేపల్లో బీ12 విటమిన్‌, రైబోప్లవిన్‌, నియాసిన్‌, బయెటిక్‌, థయామిన్‌ తదితర విటమిన్లు లభిస్తాయి. చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు , ఆస్తమా , మధుమోహ వ్యాధి ఉన్న వారు చేపలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది

గర్భిణీ స్త్రీలతో పాటు, పిల్లల తల్లులకు చేపలు ఎంతో మేలు చేస్తాయి. పిల్లల్లో జ్ఞాపకశక్తి , నాడీ వ్యవస్థను అభివృద్ధి చేస్తాయి. చేపల నూనె మనిషి శరీరంలో కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది

సముద్ర చేపల కాలేయంలో విటమిన్‌ ఏ , డీ , ఈ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వారి 30- 40 ఏళ్లలో సమర్థవంతమైన ప్రత్యామ్నాయం అని చెపుతారు

ఆంధ్రప్రదేశ్‌లో చేపల్లో కొర్రమీనులో లభించే ఆరాఖిడోనిక్‌ ఆమ్లం ఉంటుంది. దీనిలో గాయాలైనప్పుడు రక్తం తొందరగా గడ్డకట్టించే స్వభావం ఉంటుంది. కొవ్వు పదార్ధాలను కలిగి ఉన్న సాల్మన్, ట్యూనా, ట్రౌట్, సార్డినెస్, మాకేరెల్ వంటి చేపలు ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు