ఫ్యాక్షనిజం కథలకు పెట్టింది పేరు బాలకృష్ణ

సమరసింహారెడ్డి, నరసింహనాయుడు'తరువాత అంతటి ఘన విజయాన్ని అందుకున్న సినిమా చెన్నకేశవరెడ్డి

వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  2002 సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకొంది

నేటితో ఈ సినిమా 20 ఏళ్లు పూర్తిచేసుకొంది

ఈ సినిమాలో బాలయ్య తండ్రి కొడుకు గా డబుల్ రోల్ లో కనిపిస్తాడు

ఈ చిత్రంలో  బాలకృష్ణ సరసన టబు, శ్రీయ నటించారు

ఇరవై ఏళ్ళ క్రితం తెలుగు చిత్రసీమలో అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా 'చెన్నకేశవ రెడ్డి' నిలచింది

ఫ్యాక్షనిస్టుగా, పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య నట విశ్వరూపం చూపించిన సినిమా

మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ అన్నీ సూపర్ హిట్టే

ఈ చిత్రం ఇరవై ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా  ఈ సినిమాను నేడు ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్  చేస్తూ ఉండడం విశేషం