నడక అన్నది మన శరీరానికి మంచి ఎక్సర్‌సైజ్.. రోజూ కనీసం 15 నుంచీ 30 నిమిషాలు నడిస్తే శరీరం యాక్టివ్ గా ఉంటుంది 

మనం శారీరకంగా దృఢంగా ఉండడానికి ఉన్న సులువైన పద్ధతి నడవడం. దీనికి ఎలాంటి యంత్రాలు,  ప్రత్యేక ప్రదేశాలు అవసరం లేదు.  మనం ఎక్కడైనా నడవచ్చు.

నడక బరువును అదుపులో ఉంచుతుంది. అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. నడక వల్ల కలిగే ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం

నడక గుండెకు చాలా మేలు చేస్తుంది. నిత్యం నడిచే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. నడక వల్ల రక్తప్రసరణ పెరిగి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది

నడవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. నడవడం వల్ల మన శరీరంలో ఎండోర్ఫిన్స్ ఎక్కువగా విడుదలవుతుంది.

వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుకోవడానికి మన రోగ నిరోధక శక్తి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నడక మన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది

నడవడం వల్ల ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి

నడక మనస్సును పదును చేస్తుంది ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 10,000 అడుగులు అంటే 6 నుంచి 7 కిలోమీటర్లు నడవాలి

రోజూ 30 నిమిషాలు నడిస్తే, కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు తగ్గుతాయి.

ఎక్కువగా అలసిపోయే ఎక్సర్‌సైజ్‌ల వల్ల మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది. అదే తక్కువగా అలసిపోయే వాకింగ్ వల్ల... బ్యాక్ పెయిన్ నుంచీ ఉపశమనం కలుగుతుంది.