పాలు ఎక్కువగా తాగుతున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.!

పాలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనవి. నిత్యం పాలు తాగేవారు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటారు.అనేక రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

ప్రతి రోజు కనీసం ఓ గ్లాస్ పాలను చిన్నా పెద్దా తేడా లేకుండా తాగాలి. పాలను తీసుకోవడం వల్ల ఎముకలు కూడా బలోపేతమవుతాయి.

అయితే కొందరు పాలను అతిగా తాగుతుంటారు. రోజుకు రెండు, మూడు గ్లాసుల కంటే ఎక్కువ పాలు తాగేవారు కూడా ఉంటారు.

కానీ అనునిత్యం అలాగే అధిక మొత్తంలో పాలను తాగితే శరీరంపై చెడు ప్రభావం పడి, అనర్థాలను దారి తీస్తుంది.

రోజూ ఓ గ్లాస్ కంటే ఎక్కువ పాలు తీసుకోవడం వల్ల అలసట వస్తుంది. అతి గా పాలను తాగడం వల్ల పేగు ఆరోగ్యంపై చెడు ప్రభావం కలుగుతుంది

పాలు ఎక్కువగా తాగడం వల్ల చర్మ సమస్యలు కూడా వస్తాయి. చర్మ సమస్యలకు చెక్ పెట్టే పాలను అతిగా తీసుకుంటే చర్మంపై అలర్జీలు, మొటిమలు వంటి సమస్యలు వస్తాయి.

పాలను ఎక్కువగా తాగడం వల్ల జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం పడుతుంది. ఎక్కువగా  పాలు తాగడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది.

పాలు ఎక్కువగా తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఉబ్బరం, విరేచనాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.