భోజనం చేయకుండా పిల్లలు మారాం చేస్తున్నారా?

చిన్న వయసు పిల్లల్లో ఫుడ్ తినకపోవడానికి వెనుక కొన్ని కారణాలు ఉంటాయి.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఒంట్లో నలతగా ఉన్నా జలుబు, దగ్గు లేదా ఫుడ్ అరగకపోవడం కారణంగా కూడా చిన్న పిల్లలకి ఆహారం తినాలనిపించదు.

చిన్న పిల్లలు ఆటలు ఆడుకుని ఎక్కువగా అలసిపోయే పరిస్థితుల్లో అలాంటప్పుడు ఫుడ్ తినాలనే మూడ్ లో ఉండరు.

పెద్దవాళ్లలాగే చిన్న పిల్లలకి కూడా మూడ్ ఛేంజెస్ ఉంటాయి. ఆ టైంలో వాళ్లకి ఫుడ్ తినాలని అనిపించకపోవచ్చు.

పిల్లలకి హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ తినిపించాలని ఆరాటపడడం మంచిదే. అలాగని తల్లిదండ్రులు మరీ స్ట్రిక్ట్ గా ఉండొద్దు.

హెల్దీఫుడ్‌లో చాల రకాలు ఉన్నాయి. వీటిలో చిన్న పిల్లలకి ఇష్టమైన ఆహారం ఎంచుకునే ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడు ఇష్టంగా తింటారు.

ఫుడ్ ఎప్పుడూ ఒకేలా కాకుండా రకరకాల వెరైటీల్లో షేప్స్‌లో ఉండేలా చూడాలి. న్యూట్రి మఫిన్స్, దాల్ పూరీ, రెయిన్‌బో కట్లెట్, పాన్ కేక్స్ లాంటి తినిపించాలి.