సూపర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది అనుష్క

యోగా టీచర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వీటీ హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది

అరుంధతి, వేదం, భాగమతి, బాహుబలి లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది 

లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది స్వీటీ

ఇక సైజ్ జీరో సినిమాతో స్వీటీ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది 

సైజ్ జీరో కోసం స్వీటీ బరువు పెరగడంతో ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చింది 

ఇక బరువు తగ్గాలని ఎంత ప్రయత్నించినా స్వీటీ వలన కాలేదనే చెప్పాలి 

చాలా ఏళ్ళ తరువాత అనుష్క మిస్ శెట్టి మిస్టర్ శెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది

మిస్ శెట్టి మిస్టర్ శెట్టి టీజర్ ఈ మధ్యనే రిలీజ్ అయ్యి సోషల్ మీడియాను షేక్ చేసింది

అనుష్క ఇన్నేళ్లు గ్యాప్ ఇచ్చినా, బరువు పెరిగినా అభిమానులు మాత్రం ఆమెను ఇంకా నెం 1 గానే చూస్తున్నారు

అనుష్కకి ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ అలాంటిది. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి