ప్రస్తుత కాలంలో చాలా మంది కిడ్నీలో రాళ్లు, కిడ్నీ ఫెయిల్యువర్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఆలాంటివారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
అందుకోసం కూరగాయలతో పాటు కొన్ని రకాల పండ్లను కూడా తీసుకోవాలి. పండ్లలోని పోషకాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి.
కిడ్నీల రక్షణ కోసం దానిమ్మ పండ్లను తీసుకోవచ్చు. దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి.
నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ద్రాక్ష కూడా మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే రోగనిరోధక శక్తి పెంచి, అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ద్రాక్ష కూడా మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే రోగనిరోధక శక్తి పెంచి, అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
ఆపిల్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి మూత్ర పిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
యాంటీఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగిన స్ట్రాబెర్రీలు శరీర ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ బెర్రీల్లోని విటమిన్ సి, ఫైబర్ కంటెంట్ కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఫైబర్ ఎక్కువగా ఉండే అంజీరా పండ్లు మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అంజీర్‌లోని ఇతర పోషకాలు కూడా కిడ్నీలను రక్షించడానికి ఉపయోగపడతాయి.