గవర్నర్ తమిళిసై నేతృత్వంలో ఇవాళ తెలంగాణ హైకోర్టు కొత్త సీజే‌గా జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

9 నెలల గ్యాప్ తరువాత ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వచ్చారు. గవర్నర్ తో సమావేశమయ్యారు.

ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ చేయించే ఈ ప్రమాణ స్వీకారంలో సీఎంతో పాటుగా మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు.

ప్రమాణస్వీకారం అనంతరం కొత్త సీజే‌ జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్‌, గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ సమావేశం.

గవర్నర్ తమిళిసైని కలిసిన కేసీఆర్.. తేనీటి విందులోనూ పాల్గొన్నారు.. కేసీఆర్‌ను ముందుగా తమిళిసై పలకరించారు.