పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న లేెటస్ట్ మూవీ ‘ఆదిపురుష్’
రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 16 న రిలీజ్ కానుంది
ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటిస్తుంది
ఈ చిత్రంలోని జై శ్రీరామ్ సాంగ్ ను నిన్న రిలీజ్ చేశారు మేకర్స్
జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్ .. నీ సాయం సదా మేమున్నాం.. సిద్ధం సర్వసైన్యం.. సహచరులై సహా వస్తున్నాం.. సకలం స్వామి కార్యం.. మహిమాన్విత మంత్రం నీ నామం అంటూ సాగే ఈ సాంగ్ గూస్ బంప్స్ ను తెప్పిస్తుంది
రావణుడితో యుద్ధానికి సన్నద్ధం అవుతున్న సందర్భంలో వచ్చే గీతంలా కనిపిస్తోందీ పాట
ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది
రిలీజ్ అయిన 20 గంటల్లోనే జై శ్రీరామ్ సాంగ్ కు హిందీలో 31 మిలియన్ వ్యూస్, తెలుగులో 6.5 మిలియన్ వ్యూస్ అందుకుంది
24 గంటల్లోనే అతధిక వ్యూస్ సాధించిన రికార్డును జై శ్రీరామ్ సాంగ్ బద్దలుకొడుతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు