యాపిల్ తొక్కలతో మెరిసే ముఖం మీ సొంతం..

యాపిల్ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అంటారు. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి.

అయితే చాలా మంది యాపిల్ తొక్కలను తినకుండా బయట పడేస్తుంటారు. కానీ ఆపిల్ తొక్కలు వేసవిలో అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి.

చర్మ సమస్యలతో ఇబ్బందిపడే వారికి ఈ ఆపిల్ తొక్కలు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

ఆపిల్ తొక్కలో విటమిన్ కె, ఇ కారణంగా చర్మానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటితో చర్మానికి లభించే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

చర్మం తేమ తక్కువగా ఉండటం వల్ల పొడిగా ఉంటుంది. చర్మాన్ని పొడిబారకుండా ఉండేందుకు యాపిల్ తొక్కలు ఉపయోగపడతాయి.

ఈ తొక్కలను టొమాటోను కలిపి గ్రైండ్ చేసి కాస్త పెరుగు వేసి పేస్ట్ చేసుకోని ఫేస్ కి అప్లై చేసి ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో ఫేస్ కడగాలి.

యాపిల్ తొక్కలను పౌడర్‌లా చేసుకొని బటర్ కలిపి ఫేస్ పై అప్లై చేసి పూర్తిగా ఆరిపోయిన వెంటనే నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా వారానికి మూడుసార్లు అప్లై చేస్తే ముఖం ఎల్లప్పుడూ నిగారింపు గా ఉంచడంలో సహాయపడుతుందని అంటున్నారు నిపుణులు.