తెరపై ఇందిరమ్మలు

1975లో వచ్చిన ఆంధీ సినిమాలో సుచిత్రా సేన్ ఇందిరా గాంధీ గా కనిపించారు.

1981 లో వచ్చిన మిడ్ నైట్ చిల్డ్రన్స్ సినిమాలో సరితా చౌదరి ఇందిరా గాంధీ గా కనిపించారు.

2017 లో వచ్చిన 'ఇందు సర్కార్'లో ఇందిరాగాంధీ పాత్రలో సుప్రియ వినోద్ నటించారు.

'థాకరే'లోనూ, తరువాత తొలిసారి భారత్ వరల్డ్ కప్ గెలుపొందిన నేపథ్యంలో తెరకెక్కిన '83' లోనూ అవంతిక ఇందిరాలా అలరించారు.

 'పి.యమ్.నరేంద్ర మోడీ'లో  కిశోరీ షహానే  ఇందిరా గాంధీ గా కనిపించారు.

'బెల్ బాటమ్' చిత్రంలో ఇందిరాగాంధీలా లారా దత్త మెప్పించారు.

'భుజ్:ద ప్రైడ్ ఆఫ్ ఏ నేషన్'లో ఇందిరాగాంధీగా నవ్నీ పరిహార్ కనిపించారు.

'ఎమర్జెన్సీ' చిత్రం కోసం కంగనా రనౌత్ ఇందిరా గాంధీలా నటిస్తోంది.