మెగాస్టార్ చిరంజీవి టాప్ 10 బెస్ట్ సినిమాల్లో 'ఇంద్ర' ఒకటి
బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు
చిరంజీవి సరసన సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ నటించారు
జూలై 24,2002 లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది
ఇంద్ర సినిమా ఆ రోజుల్లోనే 125 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది
అప్పట్లో రజతోత్సవాలలో 'ఇంద్ర' ఓ రికార్డు నెలకొల్పింది
రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించాడు
ఇక ఈ చిత్రంలోని దాయి దాయి దామ్మ సాంగ్ కు చిరు వేసిన స్టెప్ ఇప్పటీకీ ఒక సిగ్నేచర్ గా కొనసాగుతోంది
నేటితో ఈ సినిమా 20 ఏళ్లు పూర్తిచేసుకొంది