గురువారం వీధికుక్కల దాడికి బాలుడు బలయ్యాడు.
Kazipet : వీధికుక్కలు (Street Dogs) చెలరేగిపోతున్నాయి. గురువారం వీధికుక్కల దాడికి మరో బాలుడు (Boy) బలయ్యాడు. వరంగల్-కాజీపేట (kazipet)లోని రైల్వే క్వార్టర్స్ (Railway Quarters) సమీపంలో ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ (UP)కు చెందిన వలసకూలీ కుటుంబంలో ఎనిమిదేళ్ల చిన్నారి చోటూపై దాడి చేశాయి. తీవ్ర గాయాలతో బాలుడు అక్కడిక్కడే చనిపోయాడు . స్థానిక రైల్వే క్వార్టర్స్‌లోని చిల్డ్రన్ పార్కు దగ్గర తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. నెత్తుటి మడుగులో పడి ఉన్న చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే బాలుడు చనిపోయాడని వైద్యులుతెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. కుక్కలు మీద పడటంతో చోటుతో ఆడుకుంటున్న మిగతా చిన్నారులు భయంతో పరుగులు తీశాడు. చోటు అక్కడే ఉండిపోవటంతో ఒక్క సారిగా మీదపడి కరిచాయి. భయంతో పరుగులు తీసినప్పటికీ కుక్కలు వెంటపడ్డాయని దగ్గర్లో ఎవరూ లేకపోవటంతోనే చిన్నారిని వాటి నుంచి కాపాడలేకపోయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.
ప్రాణాలతో చెలగాటం
కాజీపేట ప్రాంతంలో 47, 62, 63 డివిజన్లో వీధి కుక్కలు విపరీతంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా కుక్కలను పట్టుకుపోవటం లేదని మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే
కుక్కల దాడిలో చిన్నారి చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడదతో సాయంకాలం ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నామని, మార్నింగ్, ఈవినింగ్ వాక్ చేయాలన్న ప్రాణాలతో చెలగాటమే అన్నట్టు పరిస్థితి మారిపోయిందని చెబుతున్నారు. రోడ్డు మీద ఒక్కరు కనిపిస్తే చాలు వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయని, దీంతో ఒంటరిగా వెళ్లాలంటేనే భయంగా ఉందని అంటున్నారు. పట్టణంలో ఇటీవల కుక్కకాటు బాదితులు పెరిగిపోతున్నప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందనా లేదని అంటున్నారు. మూడు రోజుల నుంచి 8 మందికి వీధి కుక్కలు కరిచాయి.
Pi7 Image Whatsappimage2023 05 19at3.30.54pm
పొట్టకూటికోసం వస్తే… ప్రాణాలు పోయాయి
పని కోసం చోటు తల్లిదండ్రులు గురువారమే యూపీ నుంచి ఖాజీపేటకు వలస వచ్చారు. పొట్టకూటికోసం వస్తే.. మరుసటి రోజే కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చోటు డెడ్‌బాడీని పోస్ట్‌మార్టమ్ కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మృతుడి కుటుంబాన్ని ఓదార్చారు.