పార్టీకోసం పని చేసిన వారికే టికెట్: బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటి నుంచే ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. కార్యకర్తలు, పార్టీ నేతలు పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికే అధిష్టానం ఎన్నికల్లో టికెట్ ఇస్తుందని తెలిపారు. కొందరు వ్యక్తుల కొసం పని చేస్తున్నారన్న ఎంపీ.. అలాంటి వారికి ఎలాంటి పదవులు రావన్నారు. బీజేపీ పార్టీలోనే టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు ఆశావాహులను తమ చుట్టూ తిప్పుకుంటున్నారన్నారు. తిప్పుకున్న వారికి, వారితో తిరిగిన వారికి ఇద్దరికీ టికెట్లు రావన్నారు.
బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ కూడా ఇదే విషయాన్ని చెప్పారన్నారు. వ్యక్తి గత ప్రయోజనాల కోసం కొందరు పనిచేస్తున్నారన్న బండి సంజయ్.. ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకుంటూ తిరిగే వారు ముఖ్యమంత్రి కాలేరన్నారు. రాష్ట్ర అధ్యక్షుడైన తనకే టికెట్‌పై స్పష్టత లేదన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో టికెట్లు ఇప్పిస్తామని చెప్పుకున్న వారికే టికెట్లు రాలేదనే విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు.